డోర్నకల్ - డోర్నకల్

డోర్నకల్
డోర్నకల్

డొర్నకల్ (ఎస్టీ) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,91,641  . అందులో పురుషులు -  95,714 , మహిళలు - 95,922, థర్డ్ జెండర్ - 5గురు ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే డిఎస్.రెడ్యా నాయక్,  కాంగ్రెస్ పార్టీ నుంచి జాటోత్ రామచంద్రు నాయక్ పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి జి.లక్షణనాయక్, బిఎల్ఎఫ్ నుంచి సిపిఎం తరపున అంగోతు వెంకన్న ఎన్నికల బరిలోకి దిగారు. 

2014 సాధారణ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ ఐదోసారి గెలిచారు. 2009లో ఓడిపోయినా, తిరిగి తన పాత ప్రత్యర్ధి సత్యవతి రాథోడ్ ను 23531 ఓట్ల తేడాతో ఓడించారు. తెలంగాణ అంతటా టిఆర్ఎస్ ప్రభంజనం వీచినా ఇక్కడ మాత్రం అది కనిపించలేదు. 2009లో టిడిపి తరపున పోటీ చేసి విజయం సాధించిన సత్యవతి ఈసారి టిఆర్ఎస్ లోకి వెళ్లి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. డోర్నకల్ లో టిడిపి -బిజెపి కూటమి అభ్యర్ధిగా పోటీలో ఉన్న డాక్టర్ జె.ఆర్.నాయక్ కు 8384 ఓట్లు వచ్చాయి. గతంలో రాష్ట్రమంత్రిగా ఉన్న రెడ్యానాయక్, గతంలో నాలుగుసార్లు జనరల్ గా ఉన్నప్పుడు గెలిచిన గిరిజన నేత . డీ-లిమిటేషన్ తర్వాత అది రిజర్వుడుగా మారాక 2009లో ఓడిపోయి, తిరిగి 20014లో గెలుపొందారు. రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి జంప్ కావడం విశేషం. 
1957లో ఏర్పడిన డోర్నకల్ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 13 సార్లు గెలిచాయి. ఒకసారి టిడిపి గెలిచింది. 

1972లో నూకల రామచంద్రారెడ్డి అకాల మరణం తర్వాత 1974లో జరిగిన ఉప ఎన్నికలో ఆర్. సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా గెలవడం మరో విశేషం. నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తర్వాత రామసహాయం సురేందర్ రెడ్డి మరో నాలుగుసార్లు, ఆ తరువాత రెడ్యా నాయక్ కూడా నాలుగుసార్లు గెలిచారు. నూకల గతంలో దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు మంత్రివర్గాలలో పని చేశారు. నూకల కొంతకాలం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శాసనసభలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడిన శాసనసభ్యుల బృందానికి నాయకత్వం వహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. రెడ్యా నాయక్ 2004లో గెలిచాక వైఎస్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. సురేంద్రరెడ్డి మహబూబాబాద్ నుంచి ఒకసారి , వరంగల్ నుంచి మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 

  

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram