నర్సంపేట - నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,04,450. అందులో పురుషులు - 1,01,609, మహిళలు - 1,02,825, థర్డ్ జెండర్ - 16 మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దొంతి మాధవ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బిజెపి నుండి ఎడ్ల అశోక్‌రెడ్డి , బిఎల్ఎఫ్ నుంచి మద్దికాయల అశోక్ (ఎంసిపిఐ) ఎన్నికల బరిలోకి దిగారు.
తెలంగాణ టిడిపి సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి 2014 సాధారణ ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఓడిపోయారు. ఆయన ఈసారి సమీప ప్రత్యర్ధిగా కూడా నిలువలేకపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ కూడా ఓడిపోయింది. కాంగ్రెస్ టిక్కెట్ చివరి క్షణంలో కోల్పోయి, స్వతంత్రుడిగా పోటీ చేసిన దొంతి మాధవరెడ్డి గెలవడం విశేషం. టిఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ పార్టీ టిక్కెట్ పై పోటీ చేసి, మాధవరెడ్డి చేతిలో 18376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాధవరెడ్డికి సానుభూతి బాగా పని చేసిందని చెప్పాలి. మాధవరెడ్డి తదుపరి కాంగ్రెస్ లో ప్రవేశించారు. ప్రకాష్ రెడ్డికి 34479 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కత్తి వెంకటస్వామికి 6638 ఓట్లు దక్కాయి.
నర్సంపేటకు మొత్తం 13సార్లు ఎన్నికలు జరిగితే.. ఇక్కడ కాంగ్రెస్ రెండుసార్లు అది కూడా 1957, 1967లలో మాత్రమే గెలిచింది. 1972 నుంచి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేక పోయింది. అయితే 2004లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన టిఆర్ఎస్ విజయం సాధించింది. ఒకసారి ఇండిపెండెంటు గెలిచారు. వామపక్ష నేతలలో ఒకరైన మద్దికాయల ఓంకార్ ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచారు. ఆయన మూడుసార్లు సిపిఎం తరపున గెలిచారు. ఆ తర్వాత పార్టీకి దూరమై సొంతంగాగా ఎంసిపిఐని ఏర్పాటు చేసుకున్నారు. రెండుసార్లు ఇండిపెండెంటుగా నెగ్గారు. 1994లో టిడిపి అభ్యర్ధి రేవూరి ప్రకాష్ రెడ్డిపై 87 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1999లో ప్రకాష్ రెడ్డి గెలిచాక తర్వాత మూడుసార్లు గెలిచారు.
మహబూబాబాద్ జిల్లా నర్సంపేట ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురించి ప్రస్తావించారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.