పినపాక - పినపాక

పినపాక
పినపాక

పినపాక (ఎస్టీ) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,72,472. అందులో పురుషులు -   86,162,  మహిళలు - 86,302, థర్డ్ జెండర్ - 8 మంది ఉన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ నుంచే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేగ కాంతారావు పోటీ చేస్తున్నారు. ఇక బిజెపి నుండి డాక్టర్ చందా సంతోష్ కుమార్, బిఎల్ఎఫ్ నుంచి  సిపిఎం అభ్యర్ధి నాగేశ్వర్ రావు పోటీకి దిగారు. 

2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం ఖమ్మం జిల్లాలోనే వైసీపీ తన ఉనికిని నిలబెట్టుకుని ఒక ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా గిరిజన సీట్లు కావడం ప్రత్యేకత. పినపాకలో వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన సాయం వెంకటేశ్వర్లు గతంలో సిపిఐ తరపున ఒకసారి గెలిచారు. కిందటిసారి కూడా ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తదుపరి వైసిపి తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత శంకర్ నాయక్ ను 14065 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. 
గతంలో ఈ నియోజకవర్గ స్థానే బూర్గంపాడు ఉండేది. బిజెపి-టిడిపి  కూటమి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య పోటీ చేసి 28195 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. సిపిఐ తరపున పోటీ చేసిన టి.రమేష్ కు 19318 ఓట్లు వచ్చాయి. 1985 తర్వాత బూర్గుంపాడులో కాంగ్రెస్ గెలవలేదు. అయితే బూర్గుంపాడు బదులు పినపాకను పరిగణనలోకి తీసుకుంటే 2009లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. 
బూర్గంపాడులో 11సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి నాలుగుసార్లు, సిపిఐ ఐదుసార్లు, టిడిపి ఒకసారి, ఇండిపెండెంటు ఒకసారి  గెలిచారు. బూర్గుంపాడులో కొమరం రామయ్య 1967లో గెలిచాక, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో మళ్లీ జరిగిన ఉప ఎన్నికలో ఈయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కుంజు భిక్షం ఆ తర్వాత కాలంలో సిపిఐని వదిలి టిడిపిలోకి, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. తదుపరి టిఆర్ఎస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. 1983లో ఇక్కడ గెలిచిన ఊకే అబ్బయ్య 1994లో, 2009లో ఇల్లెందులో గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన చందాలింగయ్య, 2001లో ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పని చేశారు. బూర్గంపాడు, ప్రస్తుత పినపాక నియోజకవర్గాలలో కలిసి 13సార్లు గిరిజనులు ఎన్నికయ్యారు. 

  

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram