ఎల్లందు - ఎల్లందు

ఎల్లందు
ఎల్లందు

ఎల్లందు(ఎస్టీ) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,93,204. అందులో పురుషులు -   95,932,  మహిళలు - 97,258, థర్డ్ జెండర్ - 16 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి కోరం కనకయ్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బానోతు హరిప్రియా నాయక్‌ పోటీకి దిగారు. ఇక బిజెపి తమ అభ్యర్ధిగా ఎం.నాగస్రవంతి, బిఎల్ఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య(సిపిఐఎంఎల్)  ఎన్నికల బరిలో దిగారు.   

చాలాకాలం తర్వాత ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోరం కనకయ్య తన సమీప టిడిపి ప్రత్యర్ధి బాణోత్ హరిప్రియను 11507 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే కనకయ్య అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ కోరింది. టిఆర్ఎస్ అభ్యర్ధి ఊకే అబ్బయ్యకు 20865 ఓట్లు వచ్చాయి. వైసిపి తరపున పోటీ చేసిన జి.రాంబాబుకు 13993 ఓట్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు 19343 ఓట్లు వచ్చాయి. 1972 తర్వాత ఇల్లందులో కాంగ్రెస్ విజయం సాధించలేదు. 42 ఏళ్ల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ గెలవడం విశేషం. క్రితంసారి టిడిపి తరపున ఇల్లందు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఊకే అబ్బయ్యకు ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన టిఆర్ఎస్ లో చేరారు. 
అంతకుముందు అబ్బయ్య సిపిఐ తరపున రెండుసార్లు బూర్గుంపాడు, ఇల్లందు నియోజకవర్గాల నుంచి గెలిచి, తదుపరి టిడిపి పక్షాన గెలిచారు. క్రితంసారి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసిన శంకర్ నాయక్ ఈసారి టిఆర్ఎస్ తరపున పినపాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఇల్లందులో అత్యధికంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ నేత గుమ్మడి నరసయ్య ఐదుసార్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గం 1952, 57లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. కమ్యూనిస్టు నాయకుడు కె.ఎల్.నరసింహారావు ఆ రెండుసార్లే కాక... 1962లో కూడా గెలిచారు. ఇల్లందులో ఆరుసార్లు ఇండిపెండెంట్లు గెలవడం కూడా ఒక రికార్డుగానే తీసుకోవాలి.

 

 

2018 అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి తమ అభ్యర్ధిగా ఎం.నాగస్రవంతిని ఎన్నికల బరిలోకి దింపింది.  

 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram