నారాయణపేట - నారాయణపేట

నారాయణపేట
నారాయణపేట

నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,98,551 అందులో పురుషులు -98,874   మహిళలు - 99,692, థర్డ్ జెండర్  15మంది దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి ఎస్.రాజేందర్ రెడ్డి పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వామనగిరి కృష్ణ ఎన్నికల బరికలోకి దిగారు.  బిజెపి నుంచి రతంగ్ పాండురంగారెడ్డి , బిఎల్ఎఫ్ తరపున శివకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

2014 సాధారణ ఎన్నికలో నారాయణపేట నియోజకవర్గంలో చిత్రవిచిత్రాలు జరిగాయి. తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సిటింగ్ టిడిపి ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి టిఆర్ఎస్ లోకి వెళ్లి మక్తల్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, టిడిపి తరపున పోటీ చేసిన రాజేంద్రనాధ్ రెడ్డి విజయం సాధించడం విశేషం. రాజేంద్రనాధ్ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి శివకుమార్ రెడ్డిపై 2270 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసిన వి.కృష్ణకు 29278 ఓట్లు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కె.ఆర్.పాండురంగారెడ్డికి 23591 ఓట్లు లభించాయి. ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి గెలుపొందగా, అంతకుముందు మక్తల్ లో 1994, 99లలో రెండుసార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో కొంతకాలం మంత్రి పదవి నిర్వహించారు. 

  

ముస్లింల గురించి ఆలోచించే ఏకైక నేత ఆయనే

ముస్లింల గురించి ఆలోచించే ఏకైక నేత కేసీఆర్‌ మాత్రమేనని అపధర్మ డిప్యూటీ సిఎం అలీ అంటున్నారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

No results found.