జడ్చర్ల - జడ్చర్ల

జడ్చర్ల
జడ్చర్ల

జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,89,915 అందులో పురుషులు -96,249.  మహిళలు - 93,652, థర్డ్ జెండర్  14మంది దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుంచి ఆపధర్మ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మల్లు రవి పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి డాక్టర్ మధుసూదన్ యాదవ్, బిఎల్ఎఫ్ నుండి అజయ్ కుమార్ ఘోష్(బిఎల్పీ) పోటీకి దిగారు. 

జడ్చర్లలో మళ్లీ టిఆర్ఎస్ జెండా ఎగిరింది. ఈ పార్టీ నేత సి.లక్ష్మారెడ్డి 2004లో గెలిచినా , 2008 ఉప ఎన్నికలోను, 2009 సాధారణ ఎన్నికలో ఓటమిపాలయ్యారు. తిరిగి 2014లో ఆయన గెలుపొందారు. మంత్రివర్గ విస్తరణలో లక్ష్మారెడ్డికి కేసిఆర్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది.  లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి , కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి తరపున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. చంద్రశేఖర్ కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమిపాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి కొంతకాలం విప్ పదవిని నిర్వహించారు. అంతకుముందు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నాగర్ కర్నూలు ఎంపిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్ కర్నూల్ నుంచి ఎంపిగా గెలుపొందారు. అనంతరాములు పిసిసి అధ్యక్షుడిగా కూడా పని చేశారు. మల్లు రవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014లలో గెలుపొందారు. ఛీప్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను నిర్వహించారు.  రవికి మాజీ డిప్యూటీ సిఎం, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. 
జడ్చర్లకు 14సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి నాలుగుసార్లు, టిడిపి ఆరుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 
1994లో ఇక్కడ గెలిచిన ఎం.సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు.  ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎం.చంద్రశేఖర్ గెలుపొందారు. కానీ ఆయన కూడా గత టర్మ్ లో హత్యకేసులో ఇరుక్కున్నారు. ఈసారి ఓడిపోయారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత ఎన్.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు.  ఇది జనరల్ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్సీ నేత మల్లు రవి పోటీ చేసి గెలిచారు. 

  

4 'కే' లతోనే తెలంగాణకు తంటా

రాష్ట్రంలో 4‘కె’ లు  కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత,కుటుంబంతోనే 4 కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No results found.