కొడంగల్ - కొడంగల్

కొడంగల్
కొడంగల్

కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,97,337 అందులో పురుషులు -98,331  మహిళలు - 98,986, థర్డ్ జెండర్  20 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీలో కీలక నేత రేవంత్‌రెడ్డి  ఓటమిపాలయ్యారు...టీఆర్ఎస్ అభ్యర్థి  నరేందర్‌రెడ్డి చేతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది.  రేవంత్‌రెడ్డిపై 9731 ఓట్ల మెజార్టీతో నరేందర్‌రెడ్డి విక్టరీ కొట్టారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ నుండి పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుంచి నాగూరావ్‌ నామాజీ, బిఎల్ఎఫ్ తరపున వెంకటేశ్వర్లు  పోటీకి దిగారు. 

2014 సాధారణ ఎన్నికలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంల మరోసారి విజయఢంకా మోగించారు.ఈసారి కూడా ఆయన సీనియర్ నేత గురునాథరెడ్డిని 14614 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. కాకపోతే కిందటిసారి గురునాధరెద్ది కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగితే ఈసారి టిఆర్ఎస్ లో చేరి పోటీ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ ఎంపి విఠల్ రావు 36304 ఓట్లు తెచ్చుకుని మూడో స్ధానానికే పరిమితమయ్యారు. 
రేవంత్ రెడ్డి ఒకసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండుసార్లు శాసనసభకు గెలిచారు.  కొడంగల్ లో గురునాథరెడ్డి ఐదుసార్లు 1978,1983,1989,1999,2004లలో గెలుపొందారు.  
ఒక ఉప ఎన్నికతో సహా 15సార్లు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఎనిమిదిసార్లు గెలిచాయి. టిడిపి ఐదుసార్లు, స్వతంత్రపార్టీ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. 
కొడంగల్ లో సందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా , రెండుసార్లు టిడిపి తరపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్యనారాయణ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.అచ్యుతరెడ్డి రెండుసార్లు గెలిచారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది, అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

  

నా ర్యాలీకి ఎందుకు అనుమతివ్వరు..?

కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేసీఆర్ పాలన.. నవాబు పాలనను తలపిస్తుంది.

నిజాం నవాబు పాలనను కేసీఆర్ పాలన తలపిస్తుంది అని టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆయన భార్య గీత అసంతృప్తి

తారాస్థాయికి కొడంగల్ యుద్ధం

కేసిఆర్ పై చర్యలు తీసుకోండి

నా ప్రాణాలకు ముప్పు ఉంది - రేవంత్ రెడ్డి