మహబూబ్ నగర్ - మహబూబ్ నగర్

మహబూబ్ నగర్
మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,07,280 అందులో పురుషులు -1,04,033   మహిళలు - 1,03,244, థర్డ్ జెండర్  ముగ్గురు దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నే ఎన్నికల బరిలోకి దింపింది.  ప్రజా కూటమిలోని టిడిపి నుంచి ఎర్ర శేఖర్, తెలంగాణ జన సమితి నుంచి రాజేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి పద్మజారెడ్డి  పోటీకి దిగారు. 

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడుగా , తెలంగాణ జెఏసి కో ఛైర్మన్ గా ఉన్న శ్రీనివాస గౌడ్ టిఆర్ఎస్ లో చేరి మహబూబ్ నగర్ నుంచి 2014 శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి , బిజెపి నేత శ్రీనివాసరెడ్డిపై 3039 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తోపాటు టిఆర్ఎస్ రెబల్ అభ్యర్ధి కూడా ఉన్నా, శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్ధి ఒబెదుల్లా కొత్వాల్ కు 22744 ఓట్లు, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన టిఆర్ఎస్ రెబల్ అభ్యర్ధి ఇబ్రహీం సయూద్ కు 27935 ఓట్లు వచ్చాయి. 
మహబూబ్ నగర్ కు 15సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి , ప్రజాపార్టీ ఒకసారి గెలుపొందగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ నుంచి నెగ్గారు. సీనియర్ నేత పి.చంద్రశేఖర్ మహబూబ్ నగర్ లో టిడిపి తరపున నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ పోటీ చేసిన వారిలో ఇబ్రహిం అలీ అన్సారీ, ఎం.రామిరెడ్డి, పులి వీరన్నలు రెండేసిసార్లు గెలిచారు. చంద్రశేఖర్ గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లో పని చేశారు. పులి వీరన్న 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్ ఉన్నారు. ఇబ్రహిం అలీ అన్సారీ పూర్వం కాసు , పివి.జలగం క్యాబినెట్ లలో ఉన్నారు. 

   

14 స్థానాలు గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం...

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఎదుర్కునే శక్తి లేక కూటమిగా ఏర్పడుతున్నాయి

టీఆర్ఎస్ ను ఎదురుకునే శక్తి లేక అన్ని ముఠాలు కూటమిగా ఏర్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గురువారం అయన తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

No results found.