మక్తల్ - మక్తల్

మక్తల్
మక్తల్

మక్తల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,06,909 అందులో పురుషులు -1,02,813.  మహిళలు - 1,04,331, థర్డ్ జెండర్  19మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు.  మహాకూటమిలోని టిడిపి నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి బి.కొండయ్య పోటీకి దిగారు.   

2014 ఎన్నికలలో టిడిపి నేత దయాకర్ రెడ్డి, ఆయన భార్య సీత ఇద్దరూ ఓటమి పాలయ్యారు. నారాయణ పేట నుంచి ఈసారి మక్తల్ కు మారిన మాజీ మంత్రి ఎల్లారెడ్డి కూడా ఓటమి చెందారు. గతంలో ఒకసారి ఉప ఎన్నికలో గెలుపొందిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి 2014లో కాంగ్రెస్ అభ్యర్దిగా రంగంలోకి దిగి వీరిద్దరిని ఓడించడం విశేషం. ఎల్లారెడ్డి గతంలో టిడిపిలో ఉండగా, ఆయన 2014లో టిఆర్ఎస్ లోకి మారి పోటీ చేసినా ఓడిపోవాల్సి వచ్చింది. రామ్మోహన్ రెడ్డి 10027 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మూడో స్థానం లో ఉన్న దయాకర్ రెడ్డికి 35235 ఓట్లు వచ్చాయి. 
మక్తల్ నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి 10సార్లు, టిడిపి మూడుసార్లు, జనతా, జనతాదళ్ ఒక్కొక్కసారి గెలుపొందాయి. 1952,57లలో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడ నుంచి కళ్యాణి రామచంద్రరావు మూడుసార్లు, సి.నర్సిరెడ్డి మూడుసార్లు గెలుపొందారు. వై.ఎల్లారెడ్డి ఇక్కడ రెండుసార్లు, కొత్తగా ఏర్పడిన నారాయణపేటలో ఒకసారి గెలుపొందారు. నర్సిరెడ్డి 2009లో గెలిచాక నక్సల్స్ తూటాలకు బలైపోయారు.  ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు రామ్మోహన్ రెడ్డి గెలిచారు.  కానీ 2009లో గెలవలేకపోయారు. తిరిగి 2014లో గెలవగలిగారు. నర్శిరెడ్డి కుమార్తె డి.కె. అరుణ గద్వాల నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2014లో సోదరి, సోదరులైన అరుణ, రామ్మోహన్ రెడ్డి లు శాసనసభలో ఉన్నారు. ఇక్కడ గెలిచిన వారిలో ఇద్దరు మంత్రులు అయ్యారు.  కళ్యాణి రామచంద్రరావు గతంలో కాసు బ్రహ్మనందరెడ్డి మంత్రివర్గంలో ఉంటే , ఎల్లారెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.  1952లో ఇక్కడ గెలిచిన శాంతాబాయి, కల్వకుర్తిలో రెండుసార్లు, హైదరాబాద్ గగన్ మహల్ నుంచి ఒకసారి మొత్తం మీద నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. 

   

Activities are not Found

మక్తల్ ప్రజాశీర్వాద సభలో సిఎం కేసిఆర్ ప్రసంగం