షాద్‌నగర్ - షాద్‌నగర్

షాద్‌నగర్
షాద్‌నగర్

షాద్ నగర్  నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,85,024 అందులో పురుషులు -96,068  మహిళలు - 90,936, థర్డ్ జెండర్  20 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ  ఎన్నికలకు టిఆర్ఎస్ నుంచి  వై.అంజయ్యయాదవ్ ఎన్నికల బరిలోకి దిగారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి సి. ప్రతాపరెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి ఎన్.శ్రీవర్ఢన్ రెడ్డి, బిఎల్ఎఫ్ తరపున మన్నారం నాగరాజు(లోక్ సత్తా) పోటీకి దిగారు. 

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ సీటుగా మారిన షాద్ నగర్ నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రతాప్ రెడ్డి పోటీ చేసి గెలుపొందినా, 2014 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. టిఆర్ఎస్ నేత అంజయ్య యాదవ్ తన ప్రత్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని 17328 ఓట్ల మెజార్టీతో ఓడించారు.  ఇక్కడ బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన ఎన్.శ్రీనివాస్ రెడ్డికి 20425 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ రాష్ట్ర మాజీ సిఎం , కేరళ మాజీ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు 1952లో గెలుపొందారు. 1952 నుంచి 1962 జనరల్ ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుంచి 2004 వరకు రిజర్వుడు నియోజకవర్గంగా ఉండేది. తిరిగి 2009లో జనరల్ స్థానంగా మారింది. 
మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 11సార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. షాద్ నగర్ లో అత్యధికంగా డాక్టర్ పి.శంకరరావు నాలుగుసార్లు, గెలిచారు. ఈయన 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పోటీ చేసి ఐదోసారి గెలిచారు. ఇక్కడే ఒకసారి గెలిచిన కె.నాగన్న ఇతర చోట్ల మరో మూడుసార్లు విజయం సాధించారు. ఇక్కడ నుంచి 1957లో గెలుపొందిన షాజహాన్ బేగం అంతకుముందు పరిగిలో ఏకగ్రీవంగా గెలవడం విశేషం. ఇక్కడ గెలిచిన శంకరరావు గతంలో విజయభాస్కరరెడ్డి క్యాబినెట్ లోను, ఆ తర్వాత కిరణ్ క్యాబినెట్ లోను మంత్రి అయ్యారు. కానీ కిరణ్ తో వచ్చిన విబేధాల కారణంగా పదవి పోగోట్టుకున్నారు. 

  

శంకర్‌రావు నామినేషన్ ఉపసంహరణ...

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ స్థానంలో నుంచి బరిలోకి దిగినట్టే దిగి... మళ్లీ వెనక్కి తగ్గారు కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్‌రావు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

No results found.