దుబ్బాక - దుబ్బాక

దుబ్బాక
దుబ్బాక

దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,87,866 అందులో పురుషులు -92,453  మహిళలు - 95,413, థర్డ్ జెండర్  ఎవరూ లేరు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని  రంగంలోకి దింపింది టిఆర్ఎస్. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల నాగేశ్వర్ రెడ్డి,  ప్రజాకూటమి నుండి టిజేఎస్ అభ్యర్ధి  రాజ్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి ఎం. రఘనందనరావు, బిఎల్ఎఫ్ నుండి సిపిఎం తరపున జి.భాస్కర్ ఎన్నికల బరిలోకి దిగారు. 

గతంలో దొమ్మాట పేరుతో ఉన్న నియోజకవర్గం దుబ్బాకగా మారింది. 2009 ఎన్నికల్లో తనపై గెలిచిన మాజీ మంత్రి ముత్యంరెడ్డిని 2014 ఎన్నికలో టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి ఓడించి సత్తా చాటారు. 2004లో తొలిసారి టీఆర్ఎస్ తరపున గెలిచిన రామలింగారెడ్డి, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీ చేసి గెల్చారు.  తదుపరి సాధారణ ఎన్నికల్లో ముత్యం రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి మూడోసారి రామలింగారెడ్డి గెల్చారు. ముత్యంరెడ్డి అంతకు ముందు టిడిపిలో ఉండేవారు. ఆయన 2009లో కాంగ్రెస్ లో చేరి గెలుపొందడం విశేషం. కానీ 2014లో మాత్రం ఓటమిపాలు కాక తప్పలేదు. ముత్యంరెడ్డిని 37925 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి ఓడించారు. బిజెపి-టిడిపి కూటమి తరపున పోటీ చేసిన ఎం.రఘునందనరావు కు 15133 ఓట్లు వచ్చాయి. ఈయన గతంలో టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా  పని చేసి, తదుపరి బిజెపిలో చేరారు. ముత్యంరెడ్డి నాలుగుసార్లు దొమ్మాట నుంచి గెల్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. 2004లో ఆ తర్వాత సిద్ధిపేట, దొమ్మాటలో జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోయిన ముత్యంరెడ్డి కాంగ్రెస్ లో చేరి గెలుపొందారు. 1972లో దొమ్మాటలో గెలిచిన సోలిపేట రామచంద్రారెడ్డి ఒకసారి రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. దుబ్బాకతోపాటు దొమ్మాట నియోజకవర్గానికి 11సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఐదుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు గెల్చాయి. ఒకసారి పిడిఎఫ్ మరోసారి ఇండిపెండెంట్లు గెలుపొందారు. 
 

   

ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని  రంగంలోకి దింపింది టిఆర్ఎస్ 

దుబ్బాకలో టీఆర్ఎస్‌కు షాక్‌...

దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ పార్టీకి జెడ్పీటీసీలు షాక్ ఇచ్చారు...వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మార్పు కోసం ఓటు వేయండి

ఒక మార్పు కోసం ఓటు వేయండి.. మనుషులు, కులాలు బట్టి కాదు అతని పనితనం చూసి ఓటేయండి అని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు.. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దుబ్బాక నుండి విజయశాంతి పోటీ?

తెలంగాణ లో త్వరలో జరగనున్న ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి దిగుతున్నట్లు సమాచారం. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

No results found.