గజ్వేల్ - గజ్వేల్

గజ్వేల్
గజ్వేల్

గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,27,934 అందులో పురుషులు -1,14,362  మహిళలు - 1,13,554, థర్డ్ జెండర్  13మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆపద్ధర్మ సిఎం, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఘన విజయం సాధించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వంటేరు ప్రతాపరెడ్డిపై 2014 ఎన్నికల్లో 19,366 ఓట్ల తేడాతో గెలుపొందితే.. ఈసారి ఎన్నికల్లో 50వేలకు పైగా మెజార్టీ తో విజయం సాధించారు. 

2018 ఎన్నికల్లోనూ  ఆపధర్మ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుండి ఆకుల విజయ, బిఎల్ఎఫ్ నుంచి శ్రీరాముల శ్రీనివాస్ (బిఎల్పీ) పోటీకి దిగారు. 

టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో తన పార్టీని విజయపథాన నడిపించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు.  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 2014 సాధారణ ఎన్నికల్లో కూడా మరో కొత్త రికార్డు సృష్టించారు. రెండోసారి శాసనసభకు, పార్లమెంట్ కు పోటీ చేసి రెండుచోట్ల విజయం సాధించారు. ఇది అరుదైన విజయం. గతంలో రాష్ట్రానికి చెందిన ఏ నాయకుడు ఈ రికార్డును సాధించలేదు. 
2004లో సిద్దిపేట శాసనసభకు, కరీంనగర్ లోక్ సభకు పోటీ చేసి రెండుచోట్ల విజయం సాధించిన కేసిఆర్... 2014లో గజ్వేల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. అంతేకాక ఒకే టెర్మ్ లో రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలవడం ద్వారా కరీంనగర్ ఎంపిగా ఒకే టర్మ్ లో మూడుసార్లు గెల్చిన నేతగా కూడా రికార్డు సృష్టించారు. 1985లో తొలిసారి టిడిపి తరపున సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు.  ఆ తర్వాత 1989, 1994, 1999లో కూడా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 1999లో గెల్చిన తర్వాత మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దాంతో అసంతృప్తికి గురి అయ్యారు.  అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నడుం కట్టాలని సన్నద్దమై, డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో తాను ఏర్పాటు చేసుకున్న టిఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 
ఒక్కడితో ఆరంభమైన ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా .. పార్టీని విజయపథాన నడిపించి ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం ఏడుసార్లు శాసనసభకు ఎన్నికై తెలంగాణలోనే అత్యధిక సార్లు ఎన్నికైన ఇద్దరు నేతలలో ఒకరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే కేసిఆర్ ఏడుసార్లు శాసనసభతోపాటు ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈసారి గజ్వేల్ నుంచి పోటీ చేసి తన సమీప టిడిపి ప్రత్యర్ధి ప్రతాపరెడ్డిపై 19391 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.  ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డి 34085 ఓట్లతో మూడో స్థానానికి పరిమితయ్యారు. ఓటమి తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోయారు. 
గజ్వేల్ ఎక్కువ కాలం రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉండేది. 2009 నుంచి మళ్లీ జనరల్ అయ్యింది. ఇక్కడ ఒక ఉప ఎన్నికతో సహా 15సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు 9సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెల్చాయి. 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది.. అప్పుడు జనరల్ స్థానంలో గెల్చిన ఆర్.నరసింహారెడ్డి ఎన్నిక చెల్లదని చెప్పడంతో ఉప ఎన్నిక జరిగింది. 
 

  

ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని రంగంలోకి దింపింది టిఆర్ఎస్. 

గజ్వేల్‌ను కానుకగా ఇస్తా: వంటేరు

గజ్వేల్ లో కేసీఆర్ పై గెలిచి.. ఆ విజయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కానుకగా ఇస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

నామినేషన్‌ దాఖలు చేసిన కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా కొద్దిసేపటిక్రితం నామినేషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గజ్వేల్‌లో ఇక ప్రతీరోజూ జెండా పండుగ

ప్రతీరోజూ గజ్వేల్‌లో జెండా పండుగ చేసుకుందామన్నారు తాజా మాజీ మంత్రి హరీష్‌రావు... పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిన్న కాంగ్రెస్, నేడు తిరిగి టిఆర్ఎస్ లోకి చేరిక

గజ్వేల్ మాజీ ఎంపీపీ ఎంసీ రాజయ్య తిరిగి గులాబీ గూటికి చేరారు... వార్త వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఓదెలుకు కేసీఆర్‌ ఫోన్‌..

తనకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్వీయ నిర్బంధం నుంచి బయటికొచ్చారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిఎం కేసిఆర్, కేటిఆర్ పై రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు

గజ్వేల్ లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం