మెదక్ - మెదక్

మెదక్
మెదక్

మెదక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,93,141 అందులో పురుషులు -92,899  మహిళలు - 1,00,234, థర్డ్ జెండర్  8 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తాజా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది టిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుండి ఉపేందర్ రెడ్డి, బిజెపి నుండి ఆకుల రాజయ్య,  ఎన్ సిపి తరపున శశిధర్ రెడ్డి,  బిఎల్ఎఫ్ నుంచి దూడ యాదేశ్వర్(బిఎల్పీ) పోటీ చేస్తున్నారు. 

మెదక్ నుంచి 2009లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెల్చిన ప్రముఖ నటి విజయశాంతి 2014 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి  పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ లో విజయశాంతిని 39600 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. పద్మా దేవేందర్ తెలంగాణ అసెంబ్లీకి తొలి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. 
పద్మా గతంలో రామాయంపేట నుంచి ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాల మహాకూటమి కారణంగా ఆమెకు టిక్కెట్ రాలేదు. దాంతో తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలోకి దిగి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే పార్టీలో తిరిగి చేరి మళ్లీ ఎమ్మెల్యే అయి డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. మెదక్ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి భట్టి జగపతికి 9281 ఓట్లు వచ్చాయి. 2008లో రామాయంపేటకు జరిగిన ఉప ఎన్నిక ద్వారా శాసనసభలో ప్రవేశించిన మైనంపాటి హనుమంతరావు 2009 ఎన్నికలో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2008లో రామాయంపేట నుంచి పోటీ చేసి డీలిమిటేషన్ తర్వాత ఆ నియోజకవర్గం రద్దు కావడంతో మెదక్ నుంచి రంగంలో దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పి.శశిధర్ రెడ్డిని ఈయన ఓడించారు. తదుపరి సాధారణ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 
1952లో ఏర్పడిన మెదక్ అసెంబ్లీ స్థానానికి ఒక ఉప ఎన్నికతో సహా 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు ఐదుసార్లు, టీడీపీ ఆరుసార్లు, టీఆర్ఎస్ ఒకసారి, సీపీఐ ఒకసారి, ఒకసారి జనతా (కాంగ్రెస్ టికెట్ రాకపోతే తిరుగుబాటు చేసి జనతా టిక్కెట్ పై శశిధర్ రెడ్డి గెలిచారు) పార్టీలు గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నెగ్గారు. 
టీడీపీ నేత కరణం రామచంద్రరావు ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెల్చారు. ఒకసారి ఇండిపెండెంటుగానూ నెగ్గారు. కరణం మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య కరణం ఉమాదేవి గెలుపొందారు. కరణం రామచంద్రరావు గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లోనూ పని చేశారు. 
1989లో గెలిచిన పి.నారాయణరెడ్డి, 2004లో గెలుపొందిన శశిధర్ రెడ్డి తండ్రీకొడుకులు. 
 

  


ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది టిఆర్ఎస్ 

Activities are not Found
No results found.