నర్సాపూర్ - నర్సాపూర్

నర్సాపూర్
నర్సాపూర్

నరసాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,99,465 అందులో పురుషులు -98,174  మహిళలు - 1,01,281, థర్డ్ జెండర్  10 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే  చిలుముల మదన్ రెడ్డిని  రంగంలోకి దింపింది టిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి ఎస్.గోపి, బిఎస్పీ తరపున ఎస్.లక్ష్మి, బిఎల్ఎఫ్ నుంచి సిపిఎం అభ్యర్ధి ఎ.మల్లేష్ ఎన్నికల బరిలోకి దిగారు. 

మూడుసార్లు వరుసగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి , 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి ఓటమిపాలు కాక తప్పలేదు. టీఆర్ఎస్ అభ్యర్ధి చిలుముల మదన్ రెడ్డి ఈమెను 14217 ఓట్ల తేడాతో ఓడించారు. మదన్ రెడ్డి గతంలో ఆరుసార్లు ఇక్కడ నుంచి గెలుపొందిన సీపీఐ నేత విఠల్ రెడ్డి కుమారుడు. 
సునీత మంత్రిగా వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్ లలో పని చేశారు. ఆమె మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. నర్సాపూర్ లో బీజేపీ -టీడీపీ కూటమి తరపున పోటీ చేసిన బల్వీందర్ నాథ్ కు 6088 ఓట్లు వచ్చాయి. 
నర్సాపూర్ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి 8సార్లు గెలుపొందాయి. సీపీఐ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఒకసారి టీఆర్ఎస్ గెలుపొందింది. సీపీఐ సీనియర్ నాయకుడు సి.విఠల్ రెడ్డి ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచారు. మాజీ డిప్యూటీ సీఎం సి.జగన్నాథరావు నర్సాపూర్ లో మూడుసార్లు గెలిచారు. జగన్నాథరావు శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. 
 

  
ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే  చిలుముల మదన్ రెడ్డిని  రంగంలోకి దింపింది టిఆర్ఎస్ 

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రేషన్‌ షాపులు బంద్..!

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రేషన్ షాపులు బంద్ చేస్తారని ఆరోపించారు నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్ధి,  మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఇదో ఎన్నికల సిత్రం..

తెలంగాణలో ఎన్నికలు సమీపించడంతో కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ నర్సాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేతలు వాలిపోతున్నారు. .  వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No results found.