పటాన్‌చెరు - పటాన్‌చెరు

పటాన్‌చెరు
పటాన్‌చెరు

పటాన్ చేరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,73, 210 అందులో పురుషులు -1,40,988  మహిళలు - 1,32,168, థర్డ్ జెండర్  54 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీనివాస్ గౌడ్ పోటీకి దిగారు. బిజెపి నుంచి పి.కరుణాకర్‌రెడ్డి, బిఎల్ఎఫ్ నుండి  సిపిఎం తరపున రోయ్యపల్లి  శ్రీనివాస్  పోటీ చేస్తున్నారు. 

పటాన్ చెరులో టీఆర్ఎస్ నేత గూడెం మహిపాల్ రెడ్డి తన సమీప టీడీపీ ప్రత్యర్ధి సపన్ దేవ్ పై 18886 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 
సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. నిజానికి ఈయన టీఆర్ఎస్ లో చేరడానికి సన్నద్ధమై, కేసిఆర్ ను కూడా కలిసి చివరి క్షణంలో ఆగిపోయారు. రాహుల్ గాంధీ ఫోన్ చేసి టిక్కెట్ హామీ ఇవ్వడంత కాంగ్రెస్ లోనే కొనసాగారు. కాని ఎన్నికలో మాత్రం 37226 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉండిపోయారు. 
కొత్తగా ఏర్పడిన పటాన్ చెరులో ఒకసారి బీసీ వర్గం, ఈసారి రెడ్డి వర్గం నేత విజయం సాధించారు. 

  

టిడిపిలోకి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

టిడిపిలోకి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ..

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పటాన్ చేరు ప్రజాశీర్వాద సభలో కేసిఆర్

పటాన్ చేరులో బిజెపి అభ్యర్ధి కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం