సంగారెడ్డి - సంగారెడ్డి

సంగారెడ్డి
సంగారెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,97, 188 అందులో పురుషులు -98,624  మహిళలు - 98,546, థర్డ్ జెండర్  18 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దిగారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి రాజేశ్వర్‌రావు దేశపాండే, బిఎల్ఎఫ్ తరపున సిపిఎం అభ్యర్ధి బి.మల్లేష్ పోటీకి దిగారు. 

టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై, ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించే తూర్పు జయప్రకాష్ రెడ్డి... 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోక తప్పలేదు. టీఆర్ఎస్ తో రాజకీయంగా ఎమ్మెల్యే అయినా .. ఆ తర్వాత ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలలో 2009లో ఈయన ఒక్కరే కాంగ్రెస్ తరపున గత ఎన్నికలలో గెలుపొందగలిగారు. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విప్ పదవిని పొందారు. కిందటిసారి టీడీపీ టిక్కెట్ తో పోటీ చేసిన చింతా ప్రభాకర్ ను జగ్గారెడ్డి ఓడించగా, 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా వచ్చిన చింతా ప్రభాకర్ చేతిలో 29522 ఓట్ల తేడాతో ఓడిపోక తప్పలేదు. బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణకు 11914 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ మొత్తం 13సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెల్చాయి. టీడీపీ ఒకసారి, టీఆర్ఎస్ రెండుసార్లు, బీజేపీ ఒకసారి గెల్చాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. సంగారెడ్డిలో అత్యధికంగా ఐదుసార్లు గెల్చిన ఘనత పి.రామచంద్రారెడ్డికి దక్కింది. ఈయన 1989లో కొంతకాలం స్పీకర్ గాను, మరికొంతకాలం నేదురుమల్లి కేబినెట్లో మంత్రిగానూ పని చేశారు. 2004లో బీజేపీ తరపున లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు. 

  

జగ్గారెడ్డిపై మరో కేసు.. ఎందుకంటే..?

కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణ ప్రయోజనాలను ఆయన కాపాడగలరా?

కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారని హరీష్‌ ఆరోపించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలోనే వరస్ట్‌ నాయకుడు కేసిఆర్

కేసీఆర్ లాంటి వరస్ట్ నాయకుడు దేశంలోనే లేడని, ఆంధ్రా గుత్తేదారులతో తన సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి..   పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాంగ్రెస్ విజన్ ఉన్న పార్టీ

కాంగ్రెస్ విజన్ ఉన్న పార్టీ అన్నారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

టీఆర్‌ఎస్‌ కోసం ఆస్తులు అమ్ముకున్నా..

సంగారెడ్డి ఎమ్మెల్యే ఉద్యమకారులను అణచివేస్తున్నారని, అటువంటి వారికి మళ్లీ టికెట్‌ ఇవ్వడం సరికాదని టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ అన్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేసిఆర్ , కేటిఆర్ కు చుక్కలు చూపిస్తా.. జగ్గారెడ్డి