సిద్దిపేట - సిద్దిపేట

సిద్దిపేట
సిద్దిపేట

సిద్దిపేట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,05,802 అందులో పురుషులు -1,02,403  మహిళలు - 1,03,385, థర్డ్ జెండర్  14 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో  సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా హరీష్‌రావు గెలిచారు... ఈ సారి లక్షకు పైచీలుకు ఓట్ల మెజార్టీ సాధించి కొత్త రికార్డు సృష్టించారు... 

2018 అసెంబ్లీ ఎన్నికలకు  ఆపధర్మ మంత్రి , తాజా మాజీ ఎమ్మెల్యే హరీష్ రావునే రంగంలోకి దింపింది టిఆర్ఎస్. ప్రజాకూటమి నుండి టిజేఎస్ అభ్యర్ధి భవానీరెడ్డి పోటీ చేస్తున్నారు.  బిజెపి అభ్యర్ధిగా నాయిని నరోత్తమ్‌రెడ్డి, ఇండిపెండెంట్ గాడి.చంద్రం, బిఎల్ఎఫ్ నుంచి గ్యాదరి జగన్ (బిఎల్పీ) ఎన్నికల బరిలో నిలిచారు.

2014 సాధారణ ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడు ఉప ఎన్నికల్లో గెల్చిన ఏకైక నేతగా రికార్డు సాధించిన హరీశ్.. ఆరేళ్లలో మూడు ఉప ఎన్నికలు, ఒక సాధారణ ఎన్నికలో గెలుపొంది మరో రికార్డు సాధించారు. 2014 ఎన్నికల్లో సైతం 93928 ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి టి.శ్రీనివాస్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే అవడానికి ముందుగానే వైఎస్ కేబినెట్లో మంత్రి పదవి నిర్వహించిన హరీశ్... తెలంగాణ ఆవిర్భావంతో కేసీఆర్ కేబినెట్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
కేసీఆర్ సిద్దిపేటలో ఆరుసార్లు, గజ్వేల్ లో ఒకసారి మొత్తం ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతగా రికార్డు పొందారు. ఈ ఘనతను తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్, కాంగ్రెస్ నేత జానారెడ్డి, గతంలో యతిరాజారావులు సాధించారు. 
కేసీఆర్ కు ముందు మరో తెలంగాణ నేత మదన్ మోహన్ కూడా సిద్దిపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెల్చారు. 1970లో జరిగిన ఉప ఎన్నికలో మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి తరపున ఇండిపెండెంటుగా పోటీ చేసి గెల్చారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో కలిసిపోయారు.
 

  

ఇక 2018 ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన హరీష్ రావును రంగంలోకి దింపింది టీఆర్ఎస్. బిజెపి తమ అభ్యర్ధిగా నాయిని నరోత్తమ్‌రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపింది.

ఇవాళ సిద్దిపేటలో కేసీఆర్‌ సభ...

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్నటి నుంచే పూర్తిస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు.. వార్త పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహా కూటమి అధికారంలోకి వస్తే అంతే..

మహా కూటమి అధికారంలోకి వస్తే అంతే అంటున్నారు అపధర్మ మంత్రి హరీశ్‌రావు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేటకు చేదు అనుభవం...

సిద్దిపేటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని అడ్డుకున్నారు స్థానిక యువకులు.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

రాహుల్ గాంధీది మొసలి కన్నీరు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు అని అపధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No results found.