బాల్కొండ - బాల్కొండ
- నియోజకవర్గాలు
- ఆర్మూర్
- బోధన్
- నిజామాబాద్ -అర్బన్
- నిజామాబాద్ - రూరల్
- బాల్కొండ
- కోరట్ల
- జగిత్యాల

బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,89,885. అందులో పురుషులు - 87,243, మహిళలు - 1,02,631, థర్డ్ జెండర్ - 11 మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి కూడా తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి ఈ. అనిల్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుంచి ఆర్. రాజేశ్వర్, బిఎస్పీ నుండి సునీల్ రెడ్డి పోటీకి దిగారు.
2014 ఎన్నికల్లో వచ్చిన టీఆర్ఎస్ ప్రభంజనానికి బాల్కొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరావత్రి అనిల్ కి ఓటమి తప్పలేదు. ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపొంది.. తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ప్రశాంత్ రెడ్డికి 36,248 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్ కు 69,145 ఓట్లు.. కాంగ్రెస్ కు 32,897 ఓట్లు రాగా.. టీడీపీ తరఫున పోటీ చేసిన ఆర్మూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కొడుకు మల్లికార్జునరెడ్డి 25,494 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికే పరిమితమయ్యారు.
బాల్కొండలో ఒక ఉప ఎన్నిక సహా మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిపి పదిసార్లు గెలుపొందగా.. టీడీపీ రెండుసార్లు, సోషలిస్టు పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, టీఆర్ఎస్ ఒక్కోసారి గెలిచాయి. బాల్కొండలో నాలుగుసార్లు చొప్పున గెలిచిన ఘనత జి.రాజారాం, కె.ఆర్.సురేష్ రెడ్డిలకు దక్కింది. జి.రాజారాం 1967లో ఇక్కడ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఓ రికార్డు. ఆయన ఆర్మూర్ లో కూడా గెలుపొందడం ద్వారా మొత్తం ఐదుసార్లు చట్టసభకు వెళ్లారు. ఆయన జలగం, చెన్నారెడ్డి, అంజయ్యల మంత్రివర్గంలో పని చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజారామ్ భార్య సుశీలాబాయి ఇక్కడ నుంచి గెలిచారు. ఈవిధంగా భార్యభర్తలు ఇద్దరూ చట్టసభకు వెళ్లినట్లైంది. టీడీపీ నేత జి.మధుసూదన్ రెడ్డి రెండుసార్లు గెలిచారు.
ఈసారి కూడా బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు.