బోధన్ - బోధన్
- నియోజకవర్గాలు
- ఆర్మూర్
- బోధన్
- నిజామాబాద్ -అర్బన్
- నిజామాబాద్ - రూరల్
- బాల్కొండ
- కోరట్ల
- జగిత్యాల

బోధన్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,86,478. అందులో పురుషులు - 90,441, మహిళలు - 96,029, థర్డ్ జెండర్ - 8మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి అహ్మద్ షకీల్ మరోసారి విజయం సాధించారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు బోధన్ స్థానానికి మళ్ళీ అహ్మద్ షకీల్ ను మళ్ళీ బరిలోకి దించింది టిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి పి. సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి ఎ.శ్రీనివాస్, బిఎల్ ఎఫ్ నుండి బి.జీవన్ పోటీకి దిగారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి ఒక్కరే గెలుపొంది మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత జరిగిన తొలి ఎన్నిక... 2014లో ఆయన కూడా ఓడిపోయారు. జిల్లాలోని 9 నియోజకవర్గాలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. బోధన్ లో టీఆర్ఎస్ నేత మహ్మద్ షకీల్ విజయం సాధించారు. సుదర్శన్ రెడ్డి ఈసారి 15,850 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్.ప్రకాష్ రెడ్డికి 26,558 ఓట్లు వచ్చాయి. బోధన్ లో ఒక ఉప ఎన్నిక సహా 15సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఏడుసార్లు గెలిచాయి. టీడీపీ నాలుగుసార్లు, టీఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా నెగ్గారు.
తెరాస అభ్యర్థిగా మళ్ళీ షకీల్
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ స్థానానికి మళ్ళీ అహ్మద్ షకీల్ ను మళ్ళీ బరిలోకి దించుతోంది టిఆర్ఎస్
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ స్థానానికి మళ్ళీ అహ్మద్ షకీల్ ను మళ్ళీ బరిలోకి దించుతోంది తెరాస. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని ఈయన 15,850 ఓట్ల తేడాతో ఓడించారు.