జగిత్యాల - జగిత్యాల

జగిత్యాల
జగిత్యాల

జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,94,413. అందులో పురుషులు - 94,347,  మహిళలు - 1,00,051, థర్డ్ జెండర్ - 15మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి కూడా తన అభ్యర్థిగా డాక్టర్. సంజయ్ కుమార్ నే రంగంలోకి దింపింది టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.  ఇక బిజెపి తమ అభ్యర్ధిగా ముదుగంటి రవీందర్‌రెడ్డిని ఎన్నికల బరిలోకి దింపింది. బిఎల్ఎఫ్ నుంచి కాయితీ శంకర్ (బిఎల్పీ) పోటీకి దిగారు. 

2014 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభంజనానికి ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత టి.జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ పై 7,828 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దాంతో జీవన్ రెడ్డి ఆరోసారి విజయం సాధించినట్లయింది. జిల్లాలో అత్యధిక సార్లు గెలిచిన నేతగా ఆయన పేరు రికార్డులకు ఎక్కింది. టీడీపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ 22,385 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఒక ఎస్సీ నేత గెలుపొందారు. 
1983లో టీడీపీ తరఫున పోటీ చేసి తొలిసారి గెలుపొందిన జీవన్ రెడ్డి.. ఎన్టీఆర్ కేబినెట్ లో స్థానం పొందారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు, అనంతరం కాంగ్రెస్ లో చేరి 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే కాగలిగారు. 1994లో ఓడిపోయినప్పటికీ.. అప్పుడు గెలిచిన ఎల్.రమణ 1996లో కరీంగనర్ లోక్ సభ స్థానానికి ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో జీవన్ రెడ్డి విజయం సాధించారు. 
ఆ తదుపరి 1999, 2004 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. వైఎస్ కేబినెట్ లో ఆర్ఎండ్ బి మంత్రిగా సేవలందించారు. 
జగిత్యాలకు రెండు ఉప ఎన్నికలు సహా 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ కలిసి 10సార్లు, టీడీపీ నాలుగుసార్లు, పీడీఎఫ్ ఒకసారి, ఎస్టీఎఫ్ ఒకసారి గెలుపొందాయి.
1967లో కానుగంటి లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు గెలిచారు. 1952లో ఇక్కడ గెలుపొందిన బుట్టి రాజారాం.. 1957లో సుల్తానాబాద్ లో, 62లో పెద్దపల్లిలో, 67లో నుస్తులాపూర్ లో మొత్తం నాలుగుసార్లు విజయం సాధించారు. 1972లో ఇక్కడ గెలుపొందిన వి.జగపతిరావు, 1989లో కరీంనగర్ లో ఇండిపెండెంటుగా నెగ్గారు.
 

  

2018 అసెంబ్లీ ఎన్నికలకు సారి కూడా తన అభ్యర్థిగా సంజయ్ కుమార్ నే రంగంలోకి దింపింది టీఆర్ఎస్. ఇక బిజెపి తమ అభ్యర్ధిగా ముదుగంటి రవీందర్‌రెడ్డిని ఎన్నికల బరిలోకి దింపింది. 

 

మోడీతో కుమ్మక్కై ముందస్తుకు-ఎల్.రమణ

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రధాని మోడీతో కుమ్మక్కయి ముందస్తుకు వెళ్తున్నారని, కుటుంబ రాజకీయ మనుగడ కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొత్తులపై సమావేశమైన టీటీడీపీ, సీపీఐ

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. టీటీడీపీ, సీపీఐ వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో చంద్రబాబు ప్రచారం

తెలంగాణలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో అవసరమైన చోట పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తారని టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ చెప్పారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎంపి కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫైర్

By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram