కోరట్ల - కోరట్ల

కోరట్ల
కోరట్ల

కోరట్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,10,667. అందులో పురుషులు - 1,01,147,  మహిళలు - 1,09,514, థర్డ్ జెండర్ - 6గురు ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌ రావునే ఈసారి కూడా బరిలోకి దించింది టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుండి జె.నర్సింగ్‌రావు ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుంచి డా.జంగిలి వెంకట్, బిఎస్పీ నుండి పి. లింబాద్రి పోటీ చేస్తున్నారు. 

2009లో కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక సహా మూడుసార్లు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు గెలుపొందారు. 2009లో గెలిచిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలో గెలిచిన విద్యాసాగరరావు, 2014 సాధారణ ఎన్నికల్లో 20,585 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ రెబల్ జె.నరసింగరావుపై విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొమిరెడ్డి రాములు 24,954 ఓట్లు తెచ్చుకున్నారు. ఇక బీజేపీ - టీడీపీ కూటమి అభ్యర్ధి సురభి భీమ్ రావుకు 22,806 ఓట్లు వచ్చాయి. కోరుట్ల, అంతకుముందు బుగ్గారం నియోజకవర్గానికి కలిపి 12సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) కలిపి ఐదుసార్లు, టీడీపీ రెండుసార్లు, పీడీఎఫ్ ఒకసారి గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందడం మరో ప్రత్యేకత. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు బుగ్గారం నుంచి ఒకసారి ఇండిపెండెంట్ గా, రెండుసార్లు కాంగ్రెస్ తరపున గెలిచారు. 

   

ఈసారి కూడా విద్యాసాగర్‌ రావును బరిలోకి దించింది టీఆర్ఎస్
 

టీఆర్‌ఎస్‌ నేత ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్ధులు

అశ్వరావుపేట నియోజకవర్గంలో  టిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రచారానికి రావద్దని అడ్డకున్న తుంగారం గ్రామం వెంకట్‌రావుకాలనీలో. స్టోరీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీఆర్ఎస్‌ అభ్యర్థి విద్యాసాగర్‌రావుకు రైతుల షాక్

కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును చెరకు రైతులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram