నిజామాబాద్ - రూరల్ - నిజామాబాద్ రూరల్
- నియోజకవర్గాలు
- ఆర్మూర్
- బోధన్
- నిజామాబాద్ -అర్బన్
- నిజామాబాద్ - రూరల్
- బాల్కొండ
- కోరట్ల
- జగిత్యాల

నిజామాబాద్ (రూరల్) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,11,448. అందులో పురుషులు - 98,783, మహిళలు - 1,12,653, థర్డ్ జెండర్ - 12 మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ పై బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుండి రేకుల భూపతి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బిజెపి నుంచి కేశుపల్లి ఆనంద్ రెడ్డి, బిఎల్ఎఫ్ తరపున నూర్జహాన్ (బిఎల్పీ) ఎన్నికల బరిలోకి దిగారు.
2014 ఎన్నికల్లో సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ మరోసారి నియోజకవర్గం మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన గతంలో నిజామాబాద్ అర్బన్ లో వరుసగా రెండుసార్లు ఓడిపోయి.. ఈసారి రూరల్ నియోజకవర్గానికి మారారు. టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వైసీపీ నుంచి బయటికొచ్చిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను డి.శ్రీనివాస్ పై పోటీకి పెట్టింది. డీఎస్ పై బాజిరెడ్డి 26,547 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. బాజిరెడ్డికి 78,107 ఓట్లు, డీఎస్ కు 51,560 ఓట్లు, బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థి ఆనందరెడ్డి 25,579 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు.
పునర్విభజన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ గా మారింది. అంతకుముందు డిచ్ పల్లి పేరుతో ఉండేది. రద్దయిన డిచ్ పల్లి, ఇప్పటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒకసారి, టీడీపీ ఐదుసార్లు, సోషలిస్టు పార్టీ ఒకసారి, టీఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. 1983 నుంచి 2009 వరకు ఒక ఉప ఎన్నికలో తప్ప కాంగ్రెస్ ఎన్నడూ గెలవలేకపోయింది. సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఐదుసార్లు విజయం సాధించి, 2014లో ఎన్నికల రంగం నుంచి వైదొలిగారు. నిజామాబాద్ రూరల్ లో మూడోసారి గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అంతకుముందు 1999లో ఆర్మూరులోనూ, తదుపరి 2004లో బాన్సువాడలోనూ గెలుపొందారు.
బాజిరెడ్డి మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ పై బరిలోకి దిగారు.
డీఎస్‌తో పాటు తనపై నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన తర్వాత మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి... తొలిసారి నోరువిప్పి... సంచలన వ్యాఖ్యలు చేస్తూ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు..పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.