నిజామాబాద్ -అర్బన్ - నిజామాబాద్ (అర్బన్)

నిజామాబాద్ (అర్బన్)
నిజామాబాద్ (అర్బన్)

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,25,444. అందులో పురుషులు - 1,10,967, మహిళలు - 1,14,432, థర్డ్ జెండర్ - 45మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ మరోసారి పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాహెర్ బిన్ అమ్మాన్, బిజెపి నుండి యొండల లక్ష్మీనారాయణ, బిఎల్ఎఫ్ కూటమి నుంచి రత్నాకర్ (బిఎఫ్ బి) ఎన్నికల బరిలోకి దిగారు.

రాష్ట్ర అవతరణ తరవాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ హవా జిల్లావ్యాప్తంగా వీచింది. టీఆర్ఎస్ ప్రభంజనం జిల్లా కేంద్రంలో కూడా కనిపించింది. 2009లో బీజేపీ విజయం సాధించగా.. 2014లో టీఆర్ఎస్ పరమైంది. పార్టీ తరఫున పోటీ చేసిన బిగాల గణేశ్ 10,308 ఓట్ల ఆధిక్యంతో సమీప ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాజా మొహియుద్దీన్ పై గెలుపొందారు. క్రితంసారి లోక్ సభకు పోటీ చేసి ఓడిన గణేశ్.. ఈసారి శాసనసభకు పోటీ చేసి మొదటిసారి గెలుపొందారు. గణేశ్ కు 42,148 ఓట్లు.. ఎంఐఎం అభ్యర్ధికి 31,840 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ ధన్ పాల్ కు 28,301 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి మహేశ్ కుమార్ గౌడ్ కు 25472 ఓట్లు వచ్చాయి. 

పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేసిన డి.శ్రీనివాస్ 1989, 1999, 2004లలో ఇక్కడ మూడుసార్లు గెలుపొందారు. ఈయన 1989-94 మధ్యకాలంలో, అలాగే 2004లో వైఎస్ మంత్రివర్గంలో ఉన్నారు. నిజామాబాద్ లో 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిసి ఆరుసార్లు, టీడీపీ మూడుసార్లు, బీజేపీ రెండుసార్లు, టీఆర్ఎస్ ఒకసారి గెలవగా.. ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడి నుంచి గెలుపొందగలిగారు. కాంగ్రెస్ తరఫున డి.హుస్సేన్ రెండుసార్లు, టీడీపీ నుంచి డి.సత్యనారాయణ రెండుసార్లు గెలిచారు. 


  
బిగాల గణేష్ ఈసారి కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో  దిగుతున్నారు.

బాబు ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు

ఏపీ సీఎం చంద్రబాబు ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు అని ఎంపీ కవిత ఆరోపించారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram