జూబిలీహిల్స్ - జూబిలీహిల్స్

జూబిలీహిల్స్
జూబిలీహిల్స్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,28,018 అందులో పురుషులు -1,75,935   మహిళలు - 1,52,079, థర్డ్ జెండర్  నలుగురు దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బరిలోకి దిగారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి పి. విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బిజెపి నుండి శ్రీధర్‌రెడ్డి, బిఎల్ఎఫ్ తరపున అంజిబాబు (బిఎల్పీ) పోటీకి దిగారు. 

2014 సాధారణ ఎన్నికలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టిడిపి సంచలన విజయం సాధించింది. ఆ పార్టీ సీనియర్ నేత మాగంటి గోపినాథ్ తన సమీప ప్రత్యర్ధి ఎంఐఎం నేత నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పి.విష్ణువర్ధన్ రెడ్డి 33642 ఓట్లు తెచ్చుకుని మూడోస్థానానికి పరిమితమయ్యారు. విష్ణు దివంగత నేత , మాజీ మంత్రి పి.జనార్ధన్ రెడ్డి కుమారుడు. 2004లో ఖైరతాబాద్ లో గెలుపొందిన జనార్ధన్ రెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోగా, 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విష్ణు విజయం సాధించారు. 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి 2014లో ఓడిపోయారు. టిఆర్ఎస్ అభ్యర్ధి జి.రాజమౌళికి 18436 ఓట్లు, వైసిపి అభ్యర్ధి కె.వినయ్ రెడ్డికి 10628 ఓట్లు వచ్చాయి. 
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రెండుసార్లు ఎన్నికలు జరగ్గా 2009 కాంగ్రెస్, 2014లో టిడిపి విజయం సాధించాయి. 

  

ఆలోచించి ఓట్లు వేయండి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచించి ఓట్లు వేయండి... ఆగం కావొద్దు అని పిలుపునిచ్చారు తెలంగాణ ఆపధర్మ మంత్రి కేటీ రామారావు... వార్త పూర్తి వివరాల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.

చంద్రబాబు చేసిన సాయం మరువలేను - విష్ణువర్థన్ రెడ్డి

జూబ్లీహిల్స్ లో రాహుల్ గాంధీ, చంద్రబాబు, నారాయణ సభ