బాన్సువాడ - బాన్సువాడ

బాన్సువాడ
బాన్సువాడ

బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,69,697. అందులో పురుషులు - 81,930,  మహిళలు - 87,750, థర్డ్ జెండర్ - 17మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ  ఎన్నికలకు ఆపధర్మ మంత్రి ఈసారి కూడా పోచారం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాసుల బాలరాజు ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుండి నాయుడు ప్రకాష్, బిఎస్పీ నుంచి భీంరావు పోటీకి దిగారు. 

బాన్సువాడ నియోజకవర్గంలో సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో మరోమారు  ఘన విజయం సాధించారు.  కేసిఆర్ కేబినెట్ లో మరోసారి మంత్రి పదవిని చేపట్టారు.  టీడీపీతో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన పోచారం 2009లో టీడీపీ తరఫున  గెలిచి, ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికలలో 23,930 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్ధి కాసుల బాలరాజ్ పై గెలుపొందారు. పోచారానికి 65,868 ఓట్లు, బాలరాజుకు 41,936, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి బద్యా నాయక్ రాథోడ్ కు 19,692 ఓట్లు లభించాయి. 
1952లో ఏర్పడిన బాన్సువాడ నియోజకవర్గంలో 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు కలిసి ఏడుసార్లు గెలిచాయి. టిడిపి ఆరుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు విజయం సాధించాయి. 1983లో టిడిపి ఆవిర్భావం తర్వాత 2009 వరకు ఒక్క 2004లో ఇక్కడ ఓడిపోయింది. ఆ తర్వాత టిఆర్ఎస్ కైవసం చేసుకుంది.
1967 నుంచి ఇక్కడ కాంగ్రెస్ తరపున శ్రీనివాసరావు మూడుసార్లు గెల్చారు. ఆయన బోధన్ నుంచి కూడా ఒకసారి గెలుపొందారు. శ్రీనివాసరావు కొంతకాలం అంజయ్య మంత్రివర్గంలో ఉన్నారు. పరిగి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1952,57లో ఇక్కడ మహిళా అభ్యర్ధులు గెలుపొందగా..1957లో సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004లో గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అంతకుముందు 1999లో ఆర్మూరులో నెగ్గారు. 

  
ఈసారి కూడా పోచారం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

నామినేషన్ వేసిన పోచారం

బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాన్సువాడలో టిఆర్ఎస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం