బహదూర్‌పూరా - బహదూర్‌పూరా

బహదూర్‌పూరా
బహదూర్‌పూరా

బహదూర్ పురా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,55,735 అందులో పురుషులు -1,32,110   మహిళలు - 1,23,580, థర్డ్ జెండర్  45మంది దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే మౌజంఖాన్ మరోసారి రంగంలోకి దింపింది ఎంఐఎం. టిఆర్ఎస్ నుండి  ఇనాయత్ అలి బక్రి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాలెం బాబా పోటీకి దిగారు.  ఇక బిజెపి తమ అభ్యర్ధిగా హనీఫ్‌అలీని ఎన్నికల బరిలో నిలిపింది. బిఎల్ఎఫ్ నుండి మజీద్ అలీ బరిలో దిగారు. 

2009లో ఏర్పడిన కొత్త నియోజకవర్గం బహదూర్ పురాలో ఎంఐఎం అభ్యర్ధి మౌజంఖాన్ , 2014 సాధారణ ఎన్నికలోను మరోసారి గెలిచారు. ఈయన ఇంతకుముందు ఆసిఫ్ నగర్ నుంచి 2004లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ను ఓడించారు.  బహదూర్ పురాలో మౌజంఖాన్ తెలంగాణలో అత్యధికంగా 95054 ఓట్ల మెజార్టీతో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి రహమాన్ మహమూద్ పై గెలుపొందారు. టిఆర్ఎస్ అభ్యర్ధి జియావుద్దీన్ కు 3719 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి అబ్దుల్ సామికి 4857 ఓట్లు దక్కాయి. రెండుసార్లు ముస్లింలే గెలుపొందారు. 

   

2018 అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే మౌజంఖాన్ మరోసారి రంగంలోకి దింపింది ఎంఐఎం. ఇక బిజెపి తమ అభ్యర్ధిగా అనీఫ్‌అలీని ఎన్నికల బరిలో నిలిపింది. 

Activities are not Found
No results found.