చాంద్రాయణగుట్ట - చాంద్రాయణగుట్ట

చాంద్రాయణగుట్ట
చాంద్రాయణగుట్ట

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,90,975 అందులో పురుషులు -1,48,219   మహిళలు - 1,42,737, థర్డ్ జెండర్  19మంది దాకా ఉన్నారు. 

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల కాగా... ఎంఐఎం భోణి కొట్టింది... హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. అక్బరుద్దీన్ విజయం సాధించడం వరుసగా ఇది ఐదోసారి. ఈ సారి 50 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

2018 అసెంబ్లీ ఎన్నికలకు  చాంద్రాయణగుట్ట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను రంగంలోకి దింపింది ఎం.ఐ.ఎం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇసా బినోబాయిద్ మిస్రీ పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ నుండి ఎం సీతారాం రెడ్డి రంగంలో దిగారు.  ఇక బిజెపి తమ అభ్యర్ధిగా సయ్యద్‌ సహేజాది ఎన్నికల బరిలో నిలిపింది. 

2014 సాధారణ ఎన్నికలో మజ్లిస్ పార్టీ నాయకుడు, దివంగత సలావుద్దీన్ ఒవైసి రెండో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్టలో నాలుగోసారి విజయం సాధించారు. ఖయుమ్ ఖాన్ ప్రధాన ప్రత్యర్థిగా ఎంబీటీ నుంచి పోటీ చేశారు. అయినా విజయం సాధించలేకపోయారు. అక్బరుద్దీన్ ఒవైసీ 59,279 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ప్రకాష్ ముదిరాజ్ కు 17,391 ఓట్లు, టిఆర్ఎస్ అభ్యర్ధి ఎం.సీతారాం రెడ్డికి 7,278 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి బి.ఆర్. సదానంద్ కు 5,120 ఓట్లు వచ్చాయి. చాంద్రాయణగుట్టలో ఇంతకుముందు ఐదుసార్లు అమానుల్లాఖాన్ గెలిచారు. ఈయన మూడుసార్లు మజ్లిస్ తరపున, ఇంకోసారి ఇండిపెండెంటుగా, మరోసారి మజ్లిస్ అభ్యర్ధిగా, ఇంకోసారి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఎంబిటి పార్టీ తరపున గెలిచారు. 1999లో అమానుల్లాఖాన్ ను అక్బరుద్దీన్ ఒవైసీ ఓడించారు. చాంద్రాయణగుట్టలో ఈ రెండు పార్టీలు తప్ప వేరే పార్టీ ఏదీ గెలవకపోవడం విశేషం. 

   

2018 అసెంబ్లీ ఎన్నికలకు  చాంద్రాయణగుట్ట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను రంగంలోకి దింపింది ఎం.ఐ.ఎం. ఇక బిజెపి తమ అభ్యర్ధిగా సయ్యద్‌ సహేజాది ఎన్నికల బరిలో నిలిపింది. 

డిసెంబర్ 11న నేనే కింగ్ మేకర్: ఓవైసీ

డిసెంబర్ 11న నేనే కింగ్ మేకర్ అని ఎంఐఎం పార్టీ ఆగ్ర నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్ధి అక్బరుద్దీన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు