చార్మినార్ - చార్మినార్

చార్మినార్
చార్మినార్

చార్మినార్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,97,483 అందులో పురుషులు -1,04,794   మహిళలు - 92,643, థర్డ్ జెండర్  46మంది దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు యాకుత్ పురా సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను చార్మినార్ నుంచి రంగంలోకి దింపింది ఎంఐఎం. కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ గౌస్ పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ నుండి మహ్మద్ సలావుద్దీన్ లోడీ పోటీకి దిగారు. ఇక బిజెపి అభ్యర్ధిగా టి.ఉమామహేంద్ర , బిఎల్ఎఫ్ తరపున షేక్ ఇస్మాయిల్(బిఎల్పీ) ఎన్నికల బరిలో నిలిచారు. 

2014 సాధారణ ఎన్నికలో చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మజ్లీస్ నేత పాషా ఖాద్రీ మరోసారి గెలుపొందారు. తన సమీప టిడిపి  ప్రత్యర్ధి ఎం.ఎ. బాసిత్ పై 36,615 ఓట్ల ఆధిక్యతతో ఖాద్రీ మూడోసారి గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.వెంకటేష్ కు 5,598 ఓట్లు లభించాయి. హైదరాబాద్ లో చారిత్రాత్మకమైన చార్మినార్ శాసనసభ నియోజకవర్గంలో 1967 నుంచి కేవలం మజ్లిస్ పక్షమే గెలుస్తుంది. కొన్నిసార్లు ఇండిపెండెంట్లు గెలిచినట్లు రికార్డులు చెబుతున్నా, ఆ ఇండిపెండెంట్లు కూడా మజ్లిస్ పార్టీ వారే. మజ్లిస్ ప్రధాన నాయకుడు, దివంగత సలావుద్దీన్ ఒవైసి 1967, 1978, 1983లలో చార్మినార్ నుంచి, 1962లో ఫత్తర్ గట్టి నుంచి, 1972లో యాకుత్ పురా నుంచి గెలుపొందారు. 1962లో అప్పటి మంత్రి మాసూనా బేగంను ఓడించి చట్టసభలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఓటమి ఎరుగని నేతగా ఐదుసార్లు అసెంబ్లీకి , ఆ తర్వాత 1984 నుంచి 1999 వరకు జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆరుసార్లు గెలుపొందారు. 1989లో చార్మినార్ లో గెలుపొందిన విరాసత్ రసూల్ ఖాన్ రెండుమార్లు ఆసిఫ్ నగర్ నుంచి 2009లో నాంపల్లి నుంచి విజయం సాధించారు. చార్మినార్ లో 11సార్లు గెలిచిన వారంతా ముస్లింలే కావడం విశేషం.

   

2018 అసెంబ్లీ ఎన్నికలకు యాకుత్ పురా సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను చార్మినార్ నుంచి రంగంలోకి దింపింది ఎంఐఎం. ఇక బిజెపి తమ అభ్యర్ధిగా టి.ఉమామహేంద్ర ను ఎన్నికల బరిలో నిలిపింది. 

Activities are not Found
No results found.