గోషామహల్ - గోషామహల్

గోషామహల్
గోషామహల్

గోషామహల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,29,875 అందులో పురుషులు -1,21,334   మహిళలు - 1,08,523, థర్డ్ జెండర్  18మంది దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు  తాాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ నే మరోసారి బరిలోకి దింపింది బిజెపి. టిఆర్ఎస్ నుండి ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ పోటీ చేస్తున్నారు. బిఎల్ఎఫ్ తరపున చంద్రముఖి (బిఎల్పీ) ఎన్నికల బరిలోకి దిగారు. 

2014 సాధారణ ఎన్నికలో గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ బీజేపీ- టీడీపీ కూటమి ధాటికి ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్ 46,793 ఓట్ల ఆధిక్యతతో ముఖేష్ గౌడ్ పై గెలిచారు. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన ప్రేమకుమార్ ధూట్ కు 6,312 ఓట్లు వచ్చాయి. మాజీ మంత్రి ముఖేష్ 1989, 2004 లో మహరాజ్ గంజ్ నుంచి, 2009లో గోషామహల్ నుంచి గెలుపొందారు. 2007 నుంచి రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో సభ్యునిగా ఉంటూ, తిరిగి గెలిచి వైఎస్ కేబినెట్లో , ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కేబినెట్ లోనూ మంత్రిగా పని చేశారు. అంతుకుముందు ఉన్న మహారాజ్ గంజ్  కు తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి నాలుగుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, సంయుక్త సోషలిస్టు పార్టీ ఒకసారి గెలిచాయి. 

  

జోరెక్కిన గ్రేటర్ టిఆర్ఎస్ అభ్యర్ధుల ప్రచారం

హైదరాబాద్ కోఠి లోని గుజరాత్ గల్లీలో టిఆర్ఎస్ గోషామహల్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోర్ విస్తృత ప్రచారం చేపట్టారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోషామహల్ లో ఇంటింటికి టిఆర్ఎస్

హైదరాబాద్ రాంకోఠి శక్తి గణపతి ఆలయంలో గోషామహల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్  ప్రత్యేక పూజలు నిర్వహించారు . వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

గోషామహల్ బరిలో ట్రాన్స్ జెండర్

గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుండి బీఎల్ఎఫ్.. ట్రాన్స్ జెండర్ మువ్వల చంద్రముఖి (అలియాస్ రాజేష్)ని బరిలోకి దింపింది. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మజ్లీస్ పార్టీ పై యూపి సిఎం యోగి ఫైర్

జోరెక్కిన గ్రేటర్ టిఆర్ఎస్ అభ్యర్ధుల ప్రచారం