కార్వాన్ - కార్వాన్

కార్వాన్
కార్వాన్

కార్వాన్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,03,020 అందులో పురుషులు -1,59,020   మహిళలు - 1,43,989, థర్డ్ జెండర్  11మంది దాకా ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు కార్వాన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ను మరోసారి రంగంలోకి దింపింది ఎంఐఎం. టిఆర్ఎస్ నుండి టి జీవన్ సింగ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉస్మాన్ మహ్మాద్‌ ఆల్ హజ్రీ ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుండి టి.అమర్ సింగ్ , బిఎల్ఎఫ్ నుంచి జి.విఠల్(బిఎల్పీ) పోటీకి దిగారు. 

2014 సాధారణ ఎన్నికలో కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంఐఎం నేత, మొయినుద్దీన్ విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ కు కాకుండా కొత్త అభ్యర్ధి అయిన మొయినుద్దీన్ అవకాశం దక్కింది. బిజెపి సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కార్వాన్ లో మరోసారి పోటీ చేసి ఓటమి చెందారు. మొయినుద్దీన్ కు బాల్ రెడ్డి కన్నా 37,777 ఓట్ల ఆధిక్యత లభించింది. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన టి.జీవన్ సింగ్ కు 10,760 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి  టి. రూప్ సింగ్ కు 6, 512 ఓట్లు వచ్చాయి. 1999లో ఎన్నికైన సయ్యద్ సజ్జాద్ మరణించడంతో 2003 లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారిగా అప్సర్ ఖాన్ ఎన్నికయ్యారు. మూడు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇంతలో అసెంబ్లీ రద్దు జరిగింది. తిరిగి 2004, 2009లో గెలిచారు. ఈసారి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అంతకుముందు బిజెపి నేత బద్దం బాల్ రెడ్డి మూడుసార్లు గెల్చారు. కార్వాన్ నియోజకవర్గానికి 11సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి రెండుసార్లు, బిజెపి మూడుసార్లు, ఎంఐఎం ఐదుసార్లు, ఇండిపెండెంటు ఒకసారి విజయం సాధించారు. 

   

కార్వాన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ను మరోసారి రంగంలోకి దింపింది ఎంఐఎం

Activities are not Found
No results found.