అనంతపురం - అనంతపురం
- నియోజకవర్గాలు
- అనంతపురం

2014 సాధారణ ఎన్నికలలో అనంతపురం పార్లమెంటరీ నియోజవర్గం నుంచి టిడిపి నేత జెసి.దివాకర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి అనంత వెంకటరామిరెడ్డిపై 61991 ఓట్ల తేడాతో గెలుపొందారు. దివాకర్ రెడ్డికి 610288 ఓట్లు వస్తే, అనంత వెంకటరామిరెడ్డికి 548297 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అనిల్ చౌదరికి 16719 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయారు. 2014 ఎన్నికల్లో సీనియర్ నేతలైన దివాకర్ రెడ్డి, అనంతలు పార్టీలు మారడం విశేషం. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్న దివాకర్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో ఆపార్టీని వీడి టిడిపిలో చేరారు. ఇక ఎంపిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వదిలి వైసిపిలో చేరారు అనంత వెంకటరామిరెడ్డి. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరుచోట్ల టిడిపి, ఒకచోట వైసిపికి అధిక్యత లభించింది. టిడిపికి రాయదుర్గంలో 4137, గుంతకల్ లో 4175, తాడిపత్రిలో 20551, సింగనమలలో 6767, అనంతపురంలో 5935, కళ్యాణదుర్గంలో 22132 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక వైసిపికి కేవలం ఉరవకొండలో 2460 ఓట్ల అధిక్యత లభించింది.
అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 12సార్లు గెలిచాయి. టిడిపి మూడుసార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందాయి. అత్యధికంగా అనంత వెంకటరామిరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఆందోని రెడ్డి, డి.పుల్లయ్య, అనంత వెంకటరెడ్డిలు రెండేసి సార్లు గెలిచారు. ఒఎ.ఖాన్ ఇక్కడ ఒకసారి, కర్నూలులో మరోసారి గెలిచారు. పైడి లక్ష్మయ్య, తరిమెల నాగిరెడ్డి, డి.నారాయణ స్వామి, కాల్వ శ్రీనివాసులు, జెసి.దివాకర్ రెడ్డిలు ఒక్కోసారి గెలిచారు.