కమలాపురం - కమలాపురం

కమలాపురం
కమలాపురం

2014 సాధారణ ఎన్నికలలో కమలాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి, ఆ పార్టీ అధినేత జగన్ మేనమామ పి.రవీంద్రనాథరెడ్డి విజయం సాధించారు.  ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి పుట్టా నరసింహారెడ్డిపై 5345 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రవీంద్రనాథ్ రెడ్డి గతంలో కడప మేయరగ్ పని చేశారు. తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న నరసింహారెడ్డి, టిడిపిలో చేరి పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినా, పోటీ చేయలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోమశేఖరరెడ్డికి కేవలం 1395 ఓట్లు మాత్రమే వచ్చాయి. కమలాపురం నియోజకవర్గంలో 1994,2004లలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన జి.వీరశివారెడ్డి 2009లో కాంగ్రెస్ తరపున గెలిచారు. గత టర్మ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన అటువైపు వెళ్లారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో సస్పెండ్ అయ్యారు. మళ్లీ 2014 ఎన్నికల ముందు టిడిపిలోకి వచ్చారు. 
కమలాపురం నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి మూడుసార్లు, వైసిపి ఒకసారి, సిపిఐ ఒకసారి గెలిచాయి. ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. వీరశివారెడ్డి మొత్తం మూడుసార్లు గెలిచారు. సీనియర్ నేత మైసూరారెడ్డి ఇక్కడ మూడుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి మారిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. తర్వాత కాలంలో వైసిపిలోకి వచ్చి కీలక భూమికి పోషించిన మైసురా , తర్వాత జరిగిన పరిణామాల కారణంగా పార్టీ నుంచి బయటకొచ్చారు. మైసూరారెడ్డి గతంలో నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. వి.వెంకటరెడ్డి రెండుసార్లు గెలిచారు. 

Activities are not Found
No results found.