నెల్లూరు - నెల్లూరు
- నియోజకవర్గాలు
- నెల్లూరు

1962 నుంచి రిజర్వుడ్ గా ఉన్న నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం 2009 నుంచి జనరల్ గా మారింది. ఆ తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నికలో మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికలలో మేకపాటి తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డిపై 13478 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేకపాటికి 576396 ఓట్లు వస్తే.. టిడిపి అభ్యర్ధి సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డికి 562918 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి 22870 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసిపికి ఐదు, టిడిపికి రెండుచోట్ల అధిక్యత వచ్చింది. వైసిపికి కందుకూరులో 288. కావలిలో 272, ఆత్మకూరులో 27620, నెల్లూరు సిటీలో 4712, నెల్లూరు రూరల్ లో 5135 ఓట్ల అధిక్యత లభించింది. టిడిపికి కోవూరులో 19155, ఉదయగిరిలో 4399 ఓట్ల మెజార్టీ వచ్చింది.
నెల్లూరు లోక్ సభ స్థానానికి 19సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 13సార్లు గెలిచాయి. టిడిపి మూడుసార్లు, వైసిపి రెండుసార్లు, ఇండిపెండెంటు ఒకసారి గెలుపొందారు. రాజమోహన్ రెడ్డి నెల్లూరులో మూడుసార్లు, ఒంగోలు, నరసరావుపేటలో ఒక్కోసారి గెలిచారు. కాంగ్రెస్ నేత పనబాక లక్ష్మి మూడుసార్లు నెల్లూరు, ఒకసారి బాపట్ల నుంచి గెలుపొందారు. బి.అంజనప్ప మూడుసార్లు, కామాక్షయ్య మూడుసార్లు, పి.పెంచలయ్య మూడుసార్లు, ఆర్.ఎల్.ఎన్.రెడ్డి, బెజవాడ రామచంద్రారెడ్డి, కె.పద్మశ్రీ, యు.రాజేశ్వరి ఒక్కోసారి గెలిచారు. పనబాక లక్ష్మికి కేంద్రంలో మంత్రిగా పని చేసే అవకాశం దక్కింది.