భ‌ర‌త్ 50రోజుల ట్రైల‌ర్‌

విర‌చిస్తా నేడే న‌వ‌శ‌కం.. అంటూ భ‌ర‌త్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశాడు. భ‌ర‌త్ అంద‌రికీ న‌చ్చాడు. కేవ‌లం మ‌హేష్ అభిమానుల‌కే కాదు.. `భ‌ర‌త్ అనే నేను` అంద‌రు అభిమానుల‌కు న‌చ్చింది. అందుకే బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్ల షేర్ వ‌సూళ్లు ద‌క్కించుకుంది. మొత్తానికి ఈ క్రేజీ స‌క్సెస్ మ‌హేష్ కెరీర్‌కి కొత్త ఊపిరులూదింది. భ‌ర‌త్ స్టామినా అంతా ఇంతా కాదు అని నిరూపిస్తూ ఇప్పుడు ఏకంగా అర్థ‌శ‌త‌దినోత్స‌వ ఉత్స‌వానికే టీమ్‌ రెడీ అయ్యింది. భ‌ర‌త్ అనే నేను 50రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసింది. 

బ్రూస్‌లీ లాంటి ప్లాప్ సినిమా తీసిన డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి భ‌ర‌త్ అనే నేను రూపంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ ద‌క్కింది. ఇదే హుషారులో త‌దుప‌రి చ‌ర‌ణ్ - బోయ‌పాటి చిత్రాన్ని అంతే ప‌ట్టుద‌ల‌గా తెర‌కెక్కిస్తున్నారు దాన‌య్య‌. బ‌డ్జెట్‌లో రాజీ అన్న‌దే లేదు. క్వాలిటీ ఒక్క‌టే ముఖ్యంగా భావించే అరుదైన నిర్మాత‌గా అత‌డికి పేరుంది కాబట్టి ఈ సంస్థ నుంచి మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అంచ‌నా వేస్తున్నారు. ఇక రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌డం కూడా దాన‌య్య ప్ర‌స్తుత సినిమాకి క‌లిసొస్తోంది.