మా యంగ్ హీరోల్లో అది ఒక్కటే గమనిస్తున్నా...

మా ఫ్యామిలీ హీరోలంతా నిగర్వంతో, కష్టపడుతూ, మర్యాదతో నడుచుకోవడానికి గమనిస్తూ ఉంటానన్నారు మెగాస్టార్ చిరంజీవి... హైదరాబాద్‌లో జరిగిన 'తేజ్ ఐ లవ్‌ యూ' మూవీ ఆడియో లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ... వాళ్లు ఏంటి? వాళ్ల విజయాలేంటి? వాళ్ల అపజయాలేంటి? అనేది తర్వాత విషయం అన్నారు. ఇక సాయి ధర్మతేజ్ ఏదైనా తప్పుచేస్తే వాళ్ల అమ్మకంటే ముందుగా నేనే వార్నింగ్ ఇస్తానని... కానీ, అలాంటి పరిస్థితి తేజ్ తెచ్చుకోలేదన్నారాయన... ఈ సందర్భంగా మెగాస్టార్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...