చంద్రబాబే అవమానిస్తే దిక్కెవరు...

హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఆహ్వానం అందకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించిన మోత్కుపల్లి... తనను టీడీపీ అధినేత చంద్రబాబు అవమానించారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన వ్యక్తిని నేను, చంద్రబాబుకు కూడా కష్టాల్లో అండగా నిలబడినా నేను చేసిన పాపం ఏందో అర్థం కావడంలేదన్నారు. చంద్రబాబు కూడా నన్ను అవమానిస్తే నాకు దిక్కెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మోత్కుపల్లి నర్సింహులు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...