పవన్ తిరుమల నడకదారి హైలైట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు... ఉద‌యం 10 గంట‌ల‌కు సామాన్య భ‌క్తుల‌తో క‌లిసి శ్రీవారిని దర్శించుకున్నారాయన... త‌మ‌తో పాటే దర్శనానికి వ‌చ్చిన ప‌వ‌న్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు భక్తులు... అయితే సామాన్య భ‌క్తుల‌తో క‌లసి స్వామివారిని దర్శించుకోవడం త‌న‌కు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు పవన్... నిన్న సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్... వాహనంలో తిరుపతి వెళ్లి... అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్నారు. అసలు నడకదారిలో పవన్ ప్రయాణం ఎలా సాగింది...? పవన్ ఫ్యాన్స్ కోలాహలం ఎలా ఉండిది? నడదారిలో భక్తులతో పవన్ ఎలా మెలిగారు? అలిపిరి టు తిరుమల పవన్ కల్యాణ్ మెట్ల మార్గం పర్యటనకు సంబంధించిన హైలైట్స్ కోసం పై వీడియోను క్లిక్ చేయండి...