గంగవరం పోర్టు నిర్వాసితులకు అండగా ఉంటా...

గంగవరం పోర్టు నిర్వాసితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... గంగవరం పోర్టు నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగవరం పోర్టు నిర్వాసితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పవన్ మాట్లాడుతుండగా అక్కడున్న పవన్ అభిమానులు, స్థానికులు సీఎం... సీఎం అంటూ నినాదాలు చేయడంపై స్పందించిన జనసేనాని... మీరు సీఎం అని నినాదాలు చేయడం ద్వారా గంగవరం పోర్టు కాలుష్యం తగ్గదంటూ తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నేతలు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు జనసేన అధినేత... మాటతప్పిన ఎమ్మెల్యేలను గ్రామాల్లోనికి రానీవకుండా... సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. గంగవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాటం చేస్తానని స్పష్టం చేసినా ఆయన... గంగవరం పోర్టు కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా జనసేన ప్రయత్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...