కాలా ట్రైలర్ వచ్చేసింది 

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం 'కాలా'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ప్రస్తుత రాజకీయాలను ప్రశ్నించేలా దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రజిని ఇందులో ముంబైలోని ధారవి ప్రాంతానికి చెందిన లీడర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో విలన్ గా నటించిన నానా పాటేకర్ కు రజిని కి మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని వండర్ బార్ ఫిలిమ్స్ పై ధనుష్ నిర్మించారు. మరి ఇప్పుడొచ్చిన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.