నాడు... నేడు... అదే జనసందోహం...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి పాదయాత్ర సాగింది. 2003లో కూడా ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే మార్గం గుండా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. దాంతో ఈ రూట్ ను వైసీపీ శ్రేణులు సెంటిమెంట్‌గా భావిస్తున్నాయి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.... నేడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు... అప్పుడు, ఇప్పుడు... జనసందోహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు... ఇప్పుడోసారి అప్పటి వైఎస్‌ఆర్ పాదయాత్ర... నేటి జగన్ పాదయాత్ర విజువల్స్ చూసేందుకు పై వీడియోను క్లిక్ చేయండి...